SRPT: సుప్రీంకోర్టు CJI BR గవాయిపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నడిగూడెం మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాళ MRO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఇందిరకి వినతి పత్రం అందించారు.