BPT: కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలోని భారీ ఇసుక నిల్వ (3,73,500 మెట్రిక్ టన్నులు) కోసం SEAC (రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ)కు అధికారులు అనుమతి నివేదికలు సమర్పించారు. శుక్రవారం కలెక్టర్ వినోద్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. SEAC ఆమోదం రాగానే ఈ ఇసుక రీచ్‌ను తక్షణమే అందుబాటులోకి తెస్తామని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు.