SRD: చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పది పరీక్షలో విద్యార్థులు 100% ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.