కృష్ణా: కంకిపాడులోని రైతు బజార్‌ను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ప్రజలను నేరుగా కలిసి వారి జీవన విధానం, ఆర్థిక సమస్యలు, మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల నుంచి వివరాలు సేకరించి, సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.