SKLM: మందస మండలం గిరిజన ప్రాంతాలలో గల స్వయం సహాయక మహిళలకు ఉన్నతి పథకం ద్వారా ట్రైకార్ సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందిస్తోందని మందస వెలుగు గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు గురువారం తెలిపారు. 20నుంచి 45 సంవత్సరాల మధ్య వయసుగల షెడ్యూల్ తెగల చెందిన మహిళలు జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.