అన్నమయ్య: యువత అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లెలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబు బాకర్ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు.