NLR: దాచూరు జిల్లా పరిషత్ స్కూలులో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. వైవిధ్యం, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని ఆమె తెలిపారు.