E.G: పేద ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పధకంలో ప్రతి ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం కడియం మండలం, కడియపుసావరం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.