AKP: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఎండపల్లి గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులకు ఇరువైపులా శుభ్రం చేయించారు. పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.