SKLM: జి. సిగడాం మండలం పెంట పంచాయతీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంలో నగదును రైతులు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి, అమ్మి మోసపోవద్దని కోరారు.