KDP: కలెక్టరేట్లో శుక్రవారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, RJD శ్యాముల్, DEO షంషుద్దీన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి ప్రశంసా పత్రం అందజేసి శాలువతో సన్మానించారు.