E.G: ఎరువులు కొరతపై అన్నదాతలకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ఇవాళ కొవ్వూరు పార్టీ కార్యాలయంలో YCP ఇంఛార్జ్ తలారి వెంకటరావు ఆధ్వర్యంలో ‘అన్నదాతలకు అండగా వైసీపీ పార్టీ’ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించేవరకు పోరాడుతామని తెలిపారు.