కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలో 9 రహదారుల నిర్మాణానికి రూ.14.93 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నియోజకవర్గంలో పలు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన సందర్భంలో ఎమ్మెల్యే ఆయనకు నివేదించారు. ఇవాళ నిధులు మంజూరు కావడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.