కృష్ణా: ఘంటసాలలోని శ్రీకాకుళంలో పునర్నిర్మిత శ్రీ హనుమత్ లక్ష్మణ పరివార సమేత సీతారామ స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 21 వరకు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ఎంపీటీసీ చిన్నా, ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వానించారు. మూడు రోజులపాటు పూజలు, హోమాలు, ప్రతిష్ఠ, అన్నదానం జరగనున్నాయి.