CTR: రైతులందరు రబి సీజన్లో పండించే పంటల నమోదును ఈక్రాప్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళికృష్ణ సూచించారు. గురువారం పుంగనూరు లోడివిజన్ పరిధిలోని 8 మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2025-2026 సంవత్సరాలలో రబిలో ఎరువుల వినియోగం, పంటల నమోదు, సేంద్రియ వ్యవసాయం గురించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.