VSP: భీమిలి పరిధిలోని పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. నాయుడుపేట వద్ద బహిరంగంగా తోట పక్కనే జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వీరి వద్ద నుంచి రూ.20 వేల పైచిలుకు నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని భీమిలి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు సిటీ టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కరరావు తెలిపారు.