KRNL: పెద్దతుంబళం గ్రామంలో మిలాద్- ఉన్- నబీ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇమామ్- ఇసుబ్- అభిసాబ్ ఆధ్వర్యంలో మక్కా, మసీద్ ప్రతిమలతో ఊరేగింపు నిర్వహించారు. మసీద్ నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ జరిగింది. ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును మిలాద్ ఉన్ నబీగా జరుపుకుంటామని మత పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహెర్ హాలి, అన్వర్ భాషా, ఉసేన్ పీర పాల్గొన్నారు.