BPT: బాపట్ల మండలంలోని విద్యుత్ సబ్ డివిజన్ మారిన కారణంగా ఈ ఏప్రిల్ నెల కరెంటు బిల్లులు వసూలు చేసే సిబ్బంది అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ విద్యుత్ బిల్లులను మీసేవ కేంద్రాల ద్వారా గానీ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా చెల్లించాలని కోరారు. సకాలంలో బిల్లులు కట్టి సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.