VZM: మధ్యాహ్నం గంటపాటు కురిసిన వర్షానికి రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తిగా జలమయం అయ్యింది. దీంతో వాహనాలు కదలకలు మొరాయించాయి. మోకాళ్లలోతు నీరు చేరడంతో నడకదారిన వెళ్ళేవారు ఇబ్బందులు పడ్డారు. రైళ్లు దిగి వచ్చే ప్రయాణీకులు స్టేషన్లో పడిగాపులు పడవలసిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు వర్షం వచ్చిన రైల్వే స్టేషన్ ప్రవేశ మార్గం నీటిలో తేలుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.