NTR: విజయవాడ వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి మంగళ, గురువారాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చన్నారు. అలాగే కలెక్టరేట్లో కూడా ఎప్పుడైనా కలవొచ్చని సూచించారు. ప్రజల సౌకర్యార్థమే ఈ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.