అనకాపల్లి APEPDCL డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఎస్ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈయన నర్సీపట్నం నుంచి అనకాపల్లికి బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు అనకాపల్లి డివిజన్ ఈఈగా పనిచేసిన రాజశేఖర్ పదవీ విరమణ చేయడంతో రామకృష్ణను అనకాపల్లి బదిలీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తానన్నారు.