CTR: నియోజకవర్గ పరిధిలో ఇద్దరు లబ్ధిదారులకు రూ.16.25 లక్షల విలువైన CM సహాయ నిధి చెక్కులను MLA గురజాల జగన్ మోహన్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ మేరకు ఎగువ కండిక గ్రామానికి చెందిన మానసకు బోన్ మ్యారోకి సంబంధించి చికిత్స కోసం రూ.9.75 లక్షల చెక్కు, గిరిధర్‌కు 6.50 లక్షల చెక్కు అందించారు.