KKD: పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాడ్పుల తీవ్రత ఉమ్మడి జిల్లాపై చూపుతోంది. ఇప్పటికే దాదాపు 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అయిదు మండలాల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిం చింది. జగ్గంపేట, కోరుకొండ, చింతూరు, కూనవరం, వీఆరపురం మండలాల్లో దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు