కోనసీమ: మహిళా కవిత్వానికి మార్గదర్శి, రామాయణాన్ని తేటతెలుగులో అందించిన సహజ కవయిత్రి మొల్లమాంబ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ అన్నారు. శుక్రవారం అంబాజీపేటలో బీజేపీ ఆద్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, నల్లా పవన్‌లు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.