SKLM: కర్నూల్లో 28,29 తేదీల్లో జరిగిన అండర్-18 మహిళా రగ్బీ టోర్నీలో తిరుమల జూనియర్ కాలేజ్, శ్రీకాకుళం విద్యార్థినులు బి.గీతిక, కే.షాలిని పాల్గొన్నారు. బి.గీతిక ఉత్తమ ప్రతిభ కనబరిచి నేషనల్ లెవెల్‌కు ఎంపిక కాగా, షాలిని స్టేట్ లెవెల్లో మెడల్ సాధించింది. ప్రిన్సిపాల్ వి.టి. నాయుడు, డైరెక్టర్లు, ఏఓ వీరిని సన్మానించారు.