BPT: బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ కాలనీలలో రోడ్లకు నీరు నిలవకుండా మెరకలు తోలాలని సీఐటీయూ పట్టణ నాయకుడు శరత్ చెప్పారు. గురువారం బాపట్ల మున్సిపాలిటీ డిఈ కృష్ణారెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. రహదారులు మొత్తం పల్లం కావడంతో వర్షం పడినప్పుడు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.