TPT: జలధార-జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో సమగ్రంగా అమలు చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.