BPT: జాతీయ స్థాయి జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణకు బాపట్ల జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీరిని అభినందించారు. మార్చి 25 నుంచి 29 వరకు భువనేశ్వర్లో ఈ శిబిరం జరుగుతుంది. కీర్తన, శర్వాణి, త్రివిక్రమ్, జమీల్ ఇమేన్లు ఎంపికయ్యారు. కాగా ఏపీ తరఫున మొత్తం 20 మంది వెళ్లనున్నారు.