ELR: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, నిర్మూలనకు సమాజం అంతా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. మహిళలు పురుషులతో దేంట్లోనూ తక్కువ కాదని, ఉన్నత విద్యావంతురాలైన తరవాత తమ కాళ్లపై నిలబడిన తరవాత వివాహం చేయాలన్నారు. 18 సంవత్సరాలు లోపు బాలికలకు, 21 సంవత్సరాలు లోపు బాలురకు వివాహం చేయడం చట్ట విరుద్ధమన్నారు.