TPT: తిరుమల శ్రీవారిని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.