NTR: నందిగామ మండలం పల్లగిరి, రాఘవాపురం గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. సయ్యద్ ఖాసిం, కె.గోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో గ్రామీణ ఉపాధి హామీ బలహీనపడుతోందన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఫేస్ యాప్ హాజరు విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.