KDP: ఒంటిమిట్ట మండల పరిధి కోనరాజుపల్లిలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం SI శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. కోనరాజుపల్లిలో రమేశ్ అనే వ్యక్తి అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 180ML 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, విక్రయిస్తున్న రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.