PPM: పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం మంగళవారం పార్వతీపురం GJ కాలేజీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ నిర్వహించిన అనంతరం అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బోనల విజయచంద్ర పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తూ అమరులైన వారిని స్మరించుకున్నారు.