AKP: ఎస్ రాయవరం మండలం కొరుప్రోలులో కొబ్బరి పరిశ్రమ స్టోరేజ్ షెడ్డుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వెల్డర్ కొమ్ము నూకరాజు (50) మృతి చెందాడు. గురువారం ఎస్ రాయవరంకు చెందిన నూకరాజు వెల్డింగ్ చేయడానికి షెడ్డు పైకి ఎక్కి వెంటిలేషన్ ఫైబర్ షీట్ పై కాలు వేయడంతో జారీ కింద పడిపోయినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.