SKLM: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారిని ఆమె సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించిందని పేర్కొన్నారు.