NLR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నగరంలోని బుజబుజ నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగను శాలువాతో ఘనంగా సత్కరించారు.