ప్రకాశం: అద్దంకి మండలం సింగరకొండలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామిని దర్శి టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి లలిత్ సాగర్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం ఆలయ ఈవో తిమ్మనాయుడు వారికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.