AKP: రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెదగరువు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో 8 మంది పిల్లలతో పాటు పెద్దలు జ్వరాల బారిన పడి మంచం పట్టారు. గత వారం రోజులుగా పిల్లలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు డిమాండ్ చేశారు.