కోనసీమ: ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు విలువ కట్టలేమని, ఆ ప్రేమ అపూర్వమైనదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భంగా ఆదివారం రామచంద్రపురం మండలం చింతకుంట చెరువులోని చంద్రబాబు నగర్‌కు చెందిన వెంగళ సత్యవతి, మంగ, పలువురు మహిళలను మంత్రి పూలమాల, దుశ్శాలువతో సత్కరించి, వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.