కృష్ణా: వత్సవాయి మండలం మక్కపేటలో కొలువైన లక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.