KDP: కొండాపురంలో 11 సంవత్సరాల క్రితం గ్రామ సంత నిర్మించారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో కొండాపురం చుట్టుపక్కల రైతులు, గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సంత ప్రారంభించకపోవడంతో ప్రధాన రోడ్డు పక్కన, బండ్లపైన కూరగాయలను విక్రస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వెచ్చించి కట్టిన గ్రామ సంత నిరుపయోగంగా మారిందని వారు అన్నారు.