KDP: సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లెలోని వడ్డివారి వీధికి కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి తాగనీరు సరఫరా అయ్యే పైపులైను తరచూ దెబ్బతింటుంది. సకాలంలో అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. పైపులైను బాగు చేసి సరఫరాను పునరుద్దించాలని గ్రామస్తులు కోరుతున్నారు.