NLR: రంగనాయకులపేటలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో బంగారు గరుడ సేవ నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా పూజలు చేశారు. స్వామివారిని బంగారు గరుడ వాహనంపై ఉంచి నగరోత్సవం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి గరుడ సేవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.