NDL: కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 16న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి సోమవారం నాడు తెలిపారు. బండలాగుడు పోటీలలో గెలుపొందిన వృషభరాజములకు రూ.1,10,000 బహుమతిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేయనున్నారు. రెండవ బహుమతి రూ. 50వేలు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు.