ATP: రాయదుర్గం పట్టణం కోటలో ఆత్మకూరు వీధిలో వెలసిన దశభుజ వినాయకుడిని రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆకుల శ్రీ వెంకట శేష సాయి దంపతులు దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చక పురోహితులు శంకర్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ అర్చకులు దశభుజ వినాయకుడి చిత్రపటాన్ని రిటైర్డ్ జడ్జికి అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.