HYD: శ్రీ నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ బాటా సమీపంలోని శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించారు. వేద పండితులతో హోమాలు, భక్తిగీతాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.