KMM: తాను బతికి ఉండగానే మరణ ధ్రువీకరణ పత్రంతో తన భూమిని రెవెన్యూ అధికారులు మరొకరి పేర పట్టా చేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆదివారం ఆశ్రయించాడు. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన సాయిల వీర వెంకయ్య అనే వృద్ధుడికి చెందిన 2.11 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పట్టా చేయించుకుంది.