కృష్ణా: విడదల రజినీ మహిళ అని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలన్న విషయంపై దృష్టి పెట్టిందన్నారు.