కోనసీమ: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దులై కృషి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం పెద్ద హరిజనపేటలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందించేందుకు 96.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్(వాటర్ ట్యాంక్)ను ప్రారంభించారు.