కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం చేయలేనందుకే చట్టబద్ధత పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సమావేశం రైతులకు, ప్రజలకు మేలు చేస్తుందని భావించినా, అది కేవలం రాజకీయ విమర్శలకు, సెల్ఫ్ ప్రచారానికి మాత్రమే పరిమితమైందని అన్నారు.